News April 21, 2025

MNCL: 184 మంది పరీక్ష రాయలేదు: DEO

image

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదటి రోజైన ఆదివారం సజావుగా జరిగినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు మొత్తం 494కి 431 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 63 మంది పరీక్ష రాయలేదని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు మొత్తం 935కి 814 మంది హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News April 21, 2025

MLG: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

News April 21, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.

➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.

News April 21, 2025

WNP: జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదు

image

వనపర్తి జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేమద్దుల 10.3, దగడ 9.3, రేవల్లి 7.0, సోలిపూర్ 5.5, కామేపల్లి 3.5, గోపాల్‌పేట్ 1.5, జానంపేట 0.8, పెద్దమందడి 0.5, వనపర్తి, పెబ్బేర్, వెలుగొండ, శ్రీరంగాపూర్, మదనాపూర్, ఘన్పూర్, మిరాసిపల్లి, వీపనగండ్ల, కేతేపల్లి, పాన్గల్, అమరచింత, ఆత్మకూర్‌లో 0.00 మి.మీ.గా వర్షపాతం నమోదైంది.

error: Content is protected !!