News April 21, 2025
కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్‌స్కీ

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
అథ్లెటిక్స్ జట్టు కోచ్ రమేశ్‌పై సస్పెన్షన్ వేటు

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.
News April 21, 2025
కాసేపట్లో భారత్‌కు వాన్స్

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఉ.9.30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 4 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. ఢిల్లీ అక్షర్‌ధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్‌ను సందర్శించాక సా.6.30 గంటలకు PM మోదీతో భేటీ అవుతారు. ధ్వైపాక్షిక చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ విందు ఇస్తారు. ఇవాళ రాత్రికి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.
News April 21, 2025
నాని సినిమాల్లో ‘HIT 3’ రికార్డు

నేచురల్ స్టార్ నాని నటించిన ‘HIT-3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USAలో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటివరకు $75K వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుండగా, 10 రోజుల ముందే ఈ ఫీట్‌ను సాధించింది. దీంతో నాని కెరీర్‌లో అత్యంత వేగంగా $75K మార్కును చేరుకున్న సినిమాగా నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రికార్డునూ సాధించనుంది.