News April 21, 2025
జనగామ: ‘మూడు దశాబ్దాల జ్ఞాపకాలు’

జనగామ జిల్లా మండల కేంద్రమైన పాలకుర్తి ఉన్నత పాఠశాలలో 1990-91 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆనందోత్సవాలతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 8 మంది అకాల మృతి చెందగా వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అప్పటి గురువులను సన్మానించారు.
Similar News
News April 21, 2025
MLG: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
News April 21, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.
News April 21, 2025
WNP: జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేమద్దుల 10.3, దగడ 9.3, రేవల్లి 7.0, సోలిపూర్ 5.5, కామేపల్లి 3.5, గోపాల్‌పేట్ 1.5, జానంపేట 0.8, పెద్దమందడి 0.5, వనపర్తి, పెబ్బేర్, వెలుగొండ, శ్రీరంగాపూర్, మదనాపూర్, ఘన్పూర్, మిరాసిపల్లి, వీపనగండ్ల, కేతేపల్లి, పాన్గల్, అమరచింత, ఆత్మకూర్‌లో 0.00 మి.మీ.గా వర్షపాతం నమోదైంది.