News April 21, 2025

నేటి నుంచి 57 నగరాల్లో కాంగ్రెస్ ప్రెస్‌మీట్లు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ED ఛార్జిషీట్ ఫైల్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ‘కాంగ్రెస్ నిజాలు, బీజేపీ అబద్ధాలు’ క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామంది. దేశంలోని 57 నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సిటీస్, నేతల పేర్లతో జాబితా విడుదల చేసింది.

Similar News

News August 5, 2025

పవన్ సార్.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే: హరీశ్ శంకర్

image

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ పూర్తయినట్లు హరీశ్ తాజాగా ప్రకటించారు. ‘మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది’ అని పేర్కొంటూ హీరోతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. పవన్ అందించిన ఎనర్జీ, సపోర్ట్‌తో షూటింగ్‌‌ను పూర్తి చేశామన్నారు.

News August 5, 2025

భారత్‌లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?

image

ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కంపెనీ భారత్‌లో రెండో షో రూమ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న ఢిల్లీలో షో రూమ్‌ను ఓపెన్ చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ EV సంస్థ గత నెల 15న ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. మోడల్ Y SUVని రెండు వెర్షన్లలో లాంచ్ చేసింది. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ కారు బేస్ ప్రైస్ రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ బేస్ ప్రైస్ రూ.67.89 లక్షలుగా ఉంది.

News August 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.