News April 21, 2025

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జోష్య హరిణిరెడ్డి(6) మృతి చెందింది. ఆదివారం ఉదయం కారును బొలెరో ఢీకొనడంతో చిన్నారితోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపూర్ తీసుకెళ్తుండగా జోష్య మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేశ్ వెల్లడించారు.

Similar News

News April 21, 2025

త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

image

TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

News April 21, 2025

రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.

News April 21, 2025

రామకుప్పంలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె వాసి మృతి

image

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జల్దిగాని పల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్ వివరాల మేరకు కారు చెట్టును ఢీకొంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మదనపల్లెకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్ర మత్తుతో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

error: Content is protected !!