News April 21, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 21, 2025

రణస్థలం: రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు

image

రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లె పేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 21, 2025

శ్రీకాకుళం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ ద్వారా 458 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-184 ➤ BC-A:35 ➤ BC-B:41 ➤ BC-C:6 ➤ BC-D:32 ➤ BC-E:20 ➤ SC- గ్రేడ్1:8 ➤ SC-గ్రేడ్2:27➤ SC-గ్రేడ్3:36 ➤ ST:25 ➤ EWS:44.

News April 21, 2025

నౌపడ: కోడిపందాలు కేసులో ఐదుగురి అరెస్ట్

image

సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన దాడుల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెంకి వినియోగించిన సామగ్రి తో పాటు రూ. 3,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి  కేసు నమోదు చేశారు.

error: Content is protected !!