News April 21, 2025

త్వరలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

image

TG: 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి మొబైల్ వాహనాలను పంపి పరీక్షలు నిర్వహించనుంది. లక్షణాలు బయటపడితే చికిత్స అందించనుంది. తొలి దశలో భద్రాద్రి, ఆదిలాబాద్, MBNR, సంగారెడ్డి, KNR జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Similar News

News April 21, 2025

ప్రొడ్యూసర్ నన్ను అసభ్యంగా పిలిచాడు: విద్యాబాలన్

image

బాలీవుడ్ నటి విద్యాబాలన్ గతంలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఓ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఈ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు.

News April 21, 2025

చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

image

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.

News April 21, 2025

మళ్లీ కలవనున్న ఠాక్రే సోదరులు

image

హిందీ వ్యతిరేక ఉద్యమంతో మహారాష్ట్ర కజిన్స్ కలుస్తున్నారు. అన్నదమ్ముల పిల్లలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-UBT), రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) 20 ఏళ్లుగా సొంత పార్టీలు నడుపుతున్నారు. స్కూళ్లలో హిందీని తప్పక బోధించాలన్న MH ప్రభుత్వ నిర్ణయాన్ని ఇద్దరూ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకై ఉద్ధవ్‌తోనూ కలిసి ఉద్యమిస్తానని MNS చీఫ్ ఇటీవల ప్రకటించగా మాజీ సీఎం కూడా ఓకే అన్నట్లు తాజాగా సిగ్నలిచ్చారు.

error: Content is protected !!