News April 21, 2025
సీలేరులో ఇద్దరు యువకులు గల్లంతు

చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. చింతూరుకి చెందిన శ్రీను, ప్రదీప్ గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. స్నానం చేయడానికి సీలేరు నదిలో దిగిన ప్రవాహానికి కొట్టుకుపోవడంతో అతన్ని రక్షించుకోవడం కోసం నదిలో దిగిన మరొక యువకుడు గల్లంతైనట్లు సమాచారం. స్థానికులు చింతూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2026
NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.
News January 17, 2026
NGKL: కోటిమంది ఆడబిడ్డలకు సారే పేరుతో ఇందిరమ్మ చీరలు

రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు సారక్క పేరుతో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో చీరలు పంపిణీ చేస్తే చేలకు అడ్డంగా కట్టుకున్నారు తప్ప ఆడబిడ్డలు కట్టుకోలేదని గుర్తు చేశారు. మేము మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. గ్రామాలలో చీరల పంపిణీ పూర్తయిందని పట్టణాలలో చీరలు పంపిణీ చేస్తామని అన్నారు.


