News April 21, 2025

ఎండల తీవ్రతతో జనవాణి వేళల్లో మార్పులు

image

AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.

Similar News

News April 21, 2025

పౌరసత్వం కేసు.. ఆది శ్రీనివాస్‌కు జరిమానా చెల్లించిన చెన్నమనేని

image

TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు BRS మాజీ MLA చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో శ్రీనివాస్ HCని ఆశ్రయించారు. రమేశ్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గతేడాది DECలో నిర్ధారించిన కోర్టు, శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ రమేశ్ జరిమానా కట్టారు.

News April 21, 2025

రేపటి నుంచి ‘NTR-NEEL’ మూవీ షూటింగ్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR-NEEL’ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున హీరో, డైరెక్టర్ నిల్చొని డిస్కస్ చేస్తోన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలను దాటిచేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

News April 21, 2025

న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు

image

ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం నిర్ణయం తీసుకుంది.

error: Content is protected !!