News April 21, 2025
రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
మెదక్: BRS నేతలపై కేసు నమోదు

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ చిత్రలేఖనం గీసిన బీఆర్ఎస్ నాయకులపై హావేళి ఘణపురం మండల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నేతలు ఆర్.కె.శ్రీను, జుబేర్, ఫాజిల్లపై కేసు నమోదు చేశారు.