News April 21, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ఏఈలు ఆమోదిస్తేనే ఖాతాల్లోకి డబ్బులు!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రభుత్వం 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను (AE) నియమించనుంది. వచ్చే నెల నుంచి వీరు విధుల్లో చేరనున్నారు. ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం 4 దశల్లో రూ.5లక్షలు అందించనుండగా, ఇంటి నిర్మాణాన్ని బేస్‌మెంట్ వరకు పూర్తి చేసిన వారికి తొలుత రూ.లక్ష జమ చేస్తారు. అయితే ఏఈలు ఆ ఇళ్ల బేస్‌మెంట్‌లను పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాతే డబ్బు ఖాతాల్లో జమ అవుతుంది.

Similar News

News August 5, 2025

AP న్యూస్ రౌండప్

image

*ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు, లోకేశ్‌కు ఆహ్వానం
*అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్-2025 పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
*హ్యాండ్లూమ్ వస్త్రాలపై GST భరిస్తాం: CBN
*వైనాట్ 175లాంటిదే.. జగన్ 2.0 కూడా: నిమ్మల
*మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు తీర్పు రిజర్వ్
*2020లో గుడివాడ ఏరియా ఆస్పత్రి అవకతవకలపై 11మంది వైద్యులు, నర్సులపై విచారణకు మంత్రి సత్యకుమార్ ఆదేశం

News August 5, 2025

BREAKING: సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్

image

పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ జమ్మూ‌కశ్మీర్‌‌లోని పూంఛ్ సమీపంలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ శత్రువులకు దీటుగా బదులిచ్చింది. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి.

News August 5, 2025

డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

image

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.