News April 21, 2025
ADB: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
Similar News
News April 21, 2025
పీసీసీఎఫ్‌గా జిల్లా వాసికి అదనపు బాధ్యతలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి కార్యదర్శి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి PCCF, HOFSగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన అటవి శాఖ ప్రధాన కార్యాలయం ఆర్య భవన్‌లో PCCFగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఆయన బందువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
News April 21, 2025
ADB: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో ఆదిలాబాద్‌లోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
News April 21, 2025
ఆదిలాబాద్: బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రెన్యూవల్ కాని 3 బార్ల నోటిఫికేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ADB ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫారమ్‌తో పాటు రూ.లక్ష డీడీ, చలాన్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పేరున చెల్లించి, ఈనెల 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు 8712658771 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.