News April 21, 2025
కొమురం భీమ్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా తిర్యాని 43.9 ఉష్ణోగ్రత నమోదు కాగా పెంచికల్‌పేట, వాంకిడి 43.8, బెజ్జూరు 43.7, ఆసిఫాబాద్, కౌటాల, కెరమెరి లో 43.7, దహేగాం, రెబ్బెన 43.5, సిర్పూర్ టి 43.4, కాగజ్నగర్ 43.2, జై నూర్ 42.8, చింతల మానేపల్లి 42.7, సిర్పూర్ యు 42.6, లింగాపూర్ 41.4 గా నమోదయింది.
Similar News
News April 21, 2025
NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.
News April 21, 2025
పౌరసత్వం కేసు.. ఆది శ్రీనివాస్‌కు జరిమానా చెల్లించిన చెన్నమనేని

TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు BRS మాజీ MLA చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో శ్రీనివాస్ HCని ఆశ్రయించారు. రమేశ్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గతేడాది DECలో నిర్ధారించిన కోర్టు, శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ రమేశ్ జరిమానా కట్టారు.
News April 21, 2025
కొడంగల్ కమిషనర్‌కు ప్రమోషన్

కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2 కమిషనర్‌గా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ ప్రజల సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం ఆస్తి పన్ను సాధిస్తామని పేర్కొన్నారు.