News March 28, 2024
ఉండ్రాజవరంలో భర్తను హత్య చేసిన భార్య

ఉండ్రాజవరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. మద్యం మత్తులో నిత్యం వేధించడంతో భార్య అసహనానికి గురై దాడి చేసినట్లు భార్య తెలిపింది. ఈక్రమంలో జరిగిన పరస్పర దాడులలో భర్త గొల్లవిల్లి వెంకట్, కుమారుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 23, 2026
అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులు తాళలేక నాగలక్ష్మి(23) అనే మహిళ సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల మండలం జక్కరంకు చెందిన నాగలక్ష్మికి 2018లో కళ్యాణి దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతోనే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2026
పశ్చిమగోదావరి టెన్త్ ఎగ్జామ్స్ అప్‌డేట్

పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన గణిత పరీక్షకు 23,685 మంది విద్యార్థులకు గాను 23,129 మంది హాజరయ్యారు. 556 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఓపెన్ స్కూల్ సైన్స్ పరీక్షకు 348 మంది హాజరుకాగా, 86 మంది రాలేదని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
News March 23, 2026
ప.గో: అలర్ట్.. నేడు జిల్లా వాప్తంగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు స్వయంగా వచ్చి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.


