News April 21, 2025
ఎన్నికల కమిషన్ రాజీపడింది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. USలోని బోస్టన్‌లో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘భారత ఎన్నికల కమిషన్ రాజీపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండినవారి కంటే పోలైన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అది అసాధ్యం. పోలింగ్ కేంద్రాల్లోని వీడియో ఫుటేజ్ చూసే వీల్లేకుండా చట్టాన్ని కూడా మార్చేశారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 5, 2025
మోదీ ప్రభుత్వంలో 17 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో వెల్లడించారు. UPA పాలనలో కల్పించిన 3Cr ఉద్యోగాల కంటే ఇది చాలా అధికమని పేర్కొన్నారు. గత 16 నెలల్లో 11L మందికి ఉద్యోగాలు కల్పించామని, వచ్చే ఐదేళ్లలో ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. PM రోజ్‌గార్ యోజన కింద వచ్చే రెండేళ్లలో 3.5Cr+ జాబ్స్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
News August 5, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్క రోజే ఖాతాల్లోకి ₹130 కోట్లు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.700 కోట్లు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.08 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.77 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద అందించే రూ.5 లక్షలను 4 దశల్లో ఇళ్ల స్టేటస్‌లను బట్టి ప్రతీ సోమవారం ఖాతాల్లో జమ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.130 కోట్లను బదిలీ చేశారు.
News August 5, 2025
ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న సూర్య!

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియా కప్ కోసం రెడీ అవుతున్నారు. జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం BCCI మెడికల్ స్టాఫ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. సర్జరీ తర్వాత తొలి సారిగా గత వారం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా సూర్య చివరగా జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో ఆడారు.