News April 21, 2025

తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!

image

AP: వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు.

Similar News

News August 5, 2025

నట వారసత్వంపై Jr.NTR రియాక్షన్

image

తన పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనేది పూర్తిగా వారి ఇష్టమేనని స్టార్ హీరో Jr.NTR అన్నారు. “నా తర్వాత మా ఫ్యామిలీలో ఎవరు నట వారసత్వం కొనసాగిస్తారో నాకు తెలీదు. నేనేదీ ప్లాన్ చేయలేదు. ‘నువ్వు యాక్టర్ కావాలి’ అని చెప్పే రకమైన తండ్రిని కాదు. నేను అడ్డంకి కాకుండా వారధి కావాలి అనుకుంటాను. వారే స్వయంగా ఈ ప్రపంచం, సంస్కృతులను తెలుసుకోవాలి. పండగలు వస్తే పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేస్తా’ అని వ్యాఖ్యానించారు.

News August 5, 2025

రిసిప్టులను 10 సెకన్లకు మించి పట్టుకుంటున్నారా?

image

బిల్లు రిసిప్టులను 10 సెకన్లకు మించి చేతితో పట్టుకుంటే సంతాన సామర్థ్యం తగ్గుతుందని స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. బిస్ఫెనాల్ A(BPA) లేదా బిస్ఫెనాల్ S వంటి రసాయనాలతో చేసే థర్మల్ పేపర్‌పై బిల్స్ ముద్రిస్తారు. ఇవి చర్మం ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుని, వీర్య కణాల సంఖ్య&నాణ్యతను తగ్గిస్తాయని తేలింది.

News August 5, 2025

భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% టారిఫ్స్: ట్రంప్

image

భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% వరకు టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘ప్రస్తుతానికి ఫార్మా దిగుమతులపై నామమాత్రపు టారిఫ్స్‌ విధిస్తున్నాం. కానీ ఏడాదిన్నరలో అది 150 శాతానికి చేరుతుంది. ఆ తర్వాత గరిష్ఠంగా 250% వరకు పెంచుతాం. ఎందుకంటే ఔషధాలు మా దేశంలోనే తయారు కావాలనేది మా లక్ష్యం’ అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.