News April 21, 2025
రేపు ఫలితాలు విడుదల?

UPSC సివిల్స్ తుది ఫలితాలు ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. దీంతో ఫలితాల విడుదలకు UPSC కసరత్తు చేస్తోంది.
Similar News
News August 6, 2025
SBIలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

SBIలో 5వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌లో <
News August 6, 2025
రేపటి నుంచి వారికి ఉచిత విద్యుత్

AP: చేనేతలకు భరోసా ఇచ్చేందుకు మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి వీటిని అమలు చేయాలని తెలిపారు. దీంతో పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అలాగే కార్మికుల కోసం రూ.5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
News August 6, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.