News April 21, 2025

ప్యాదిండిలో 2 బైకులు.. కారు ఢీ

image

చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఢీకొన్నాయి. దీంతో రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయి చనిపోయాడు. ప్యాదిండి గ్రామానికి చెందిన రమేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన రమేశ్‌ను చికిత్సకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 21, 2025

రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు?

image

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి అని IMDb పేర్కొంది. పారితోషికం, ప్రాఫిట్ షేర్ (కలెక్షన్స్ బట్టి), మూవీ హక్కుల విక్రయం ద్వారా ఈ మేరకు పొందుతారని తెలిపింది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర దర్శకుల్లో సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

News April 21, 2025

బాపట్ల: ఏఎన్ఎమ్‌ల సమస్యలపై స్పందించిన కలెక్టర్

image

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎమ్‌లను సర్వేలు, పింఛన్ల పంపిణీలో తమకి డ్యూటీలు వేస్తున్నారని, ఆరోగ్య శాఖకే పరిమితి చేయాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్లలో పని భారాన్ని ఏఎన్ఎమ్‌ల పై మోపవద్దని అధికారులను ఆదేశించారు.

News April 21, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

error: Content is protected !!