News April 21, 2025
KTRకు హైకోర్టులో ఊరట

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్‌లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.
Similar News
News August 6, 2025
భారత బౌలర్లు వాజిలిన్ రాశారేమో.. పాక్ మాజీ క్రికెటర్ అక్కసు

ENGపై ఐదో టెస్టులో భారత విజయంపై పాక్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. IND బౌలర్లు బాల్ ట్యాంపర్ చేసేందుకు వాజిలిన్ రాసి ఉంటారని ఆరోపించారు. అందుకే 80 ఓవర్ల తర్వాత కూడా బాల్ కొత్తదానిలా మెరుస్తూ ఉందన్నారు. అంపైర్లు ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపాలన్నారు. చట్టవిరుద్ధమైన బౌలింగ్‌తో ఏడాది నిషేధానికి గురైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావా అని భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
News August 6, 2025
సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం: అనిల్

కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్నవాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్లను తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశముంది. నిన్న నిర్మాతలు ఆయనను కలిశారు.
News August 6, 2025
బీజేపీలో చేరే వారికి ఆహ్వానం: రామ్‌చందర్

TG: బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామని పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు. ఆసిఫాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురిచేయట్లేదని తెలిపారు. నేతలకు ఆ రెండు పార్టీలపై నమ్మకం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.