News April 21, 2025

పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు!

image

అమెరికన్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్, తన ప్రేయసి డైలాన్ మేయర్ పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. 2013లో ఓ సినిమా సెట్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2021లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ట్విలైట్ ఫ్రాంచైజీ సినిమాలతో క్రిస్టెన్ పాపులయ్యారు. డైలాన్ మేయర్ నటిగా, రచయితగా పలు సినిమాలకు పనిచేశారు.

Similar News

News August 6, 2025

భారత బౌలర్లు వాజిలిన్ రాశారేమో.. పాక్ మాజీ క్రికెటర్ అక్కసు

image

ENGపై ఐదో టెస్టులో భారత విజయంపై పాక్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. IND బౌలర్లు బాల్ ట్యాంపర్ చేసేందుకు వాజిలిన్ రాసి ఉంటారని ఆరోపించారు. అందుకే 80 ఓవర్ల తర్వాత కూడా బాల్ కొత్తదానిలా మెరుస్తూ ఉందన్నారు. అంపైర్లు ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపాలన్నారు. చట్టవిరుద్ధమైన బౌలింగ్‌తో ఏడాది నిషేధానికి గురైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావా అని భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News August 6, 2025

సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం: అనిల్

image

కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్నవాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్లను తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశముంది. నిన్న నిర్మాతలు ఆయనను కలిశారు.

News August 6, 2025

బీజేపీలో చేరే వారికి ఆహ్వానం: రామ్‌చందర్

image

TG: బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామని పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు. ఆసిఫాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురిచేయట్లేదని తెలిపారు. నేతలకు ఆ రెండు పార్టీలపై నమ్మకం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.