News April 21, 2025

ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం

image

TG: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీంతో భారత్ నుంచి ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా TG నిలిచింది. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంపై రేవంత్ బృందం దృష్టి సారించింది.

Similar News

News January 5, 2026

చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

image

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

News January 5, 2026

నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

image

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.

News January 5, 2026

ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

image

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.