News April 21, 2025
BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్

గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి రిటైనర్‌షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్‌పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.
Similar News
News August 6, 2025
యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు: RBI గవర్నర్

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.
News August 6, 2025
బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: భట్టి

TG: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉందని, కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్‌కు అన్ని కులాలు, మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో BJP డబుల్ గేమ్ ఆడుతోందని TPCC చీఫ్ మహేశ్ ఫైరయ్యారు.
News August 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు <