News April 21, 2025
నాగర్‌కర్నూల్: ఈనెల 17న పదవీ విరమణ.. ఇంతలోనే విషాదం

కల్వకుర్తి పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన <<16167214>>పాపిశెట్టి శ్రీనివాసులు<<>> తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో రిటైర్డ్ అవుతున్నందున ఈనెల 17న పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా జరిపారు. నాలుగు రోజుల్లోనే మృతిచెందడం ఎంతో బాధాకరమని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News April 21, 2025
SVU పరీక్షల వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News April 21, 2025
IPL: టాస్ గెలిచిన కేకేఆర్

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsGT మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్‌ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్
KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్
News April 21, 2025
‘హైదరాబాద్‌కు రండి’.. జపాన్ కంపెనీలకు సీఎం ఆహ్వానం

TG: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.