News April 21, 2025
త్వరలోనే బోనస్ డబ్బులు విడుదల: ఉత్తమ్

TG: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.
Similar News
News April 22, 2025
పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News April 22, 2025
MI ఆటగాళ్లలో స్ఫూర్తినింపిన పొలార్డ్!

నిన్న రాత్రి CSKపై మ్యాచ్‌కు ముందు MI ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా స్పీచ్ ఇచ్చినట్లు పొలార్డ్ తెలిపారు. ‘ఆటగాళ్లతో మాట్లాడేందుకు మహేల నాకు ఛాన్స్ ఇచ్చారు. గడచిన రెండేళ్లుగా చెన్నై ఆటగాళ్లకు ‘బాగా ఆడారు’ అని చెప్పడమే సరిపోయింది. ఈసారి అలా ఉండకూడదు అని అన్నాను. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడి విజయాన్ని అందించారు’ అని చెప్పుకొచ్చారు. స్పిన్నర్లను ఆడేందుకే సూర్యను 3వ స్థానంలో పంపించినట్లు ఆయన వివరించారు.
News April 22, 2025
DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.