News March 28, 2024
సంగారెడ్డి: బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.
Similar News
News March 18, 2026
మెదక్ ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆమె అభిలషించారు.
News March 18, 2026
మెదక్: ‘కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి’

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్మిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
News March 18, 2026
నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


