News April 21, 2025

మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మృతి

image

TG: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మరణించాడు. సాహిల్ అనే వ్యక్తి నుంచి ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకే సమయంలో తీసుకోగా ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News August 10, 2025

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

image

మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘పెద్ది’తో చెర్రీ, ‘VT 15’తో వరుణ్, ‘SDT 18’తో సాయి ధరమ్ బిజీగా ఉన్నారు.

News August 10, 2025

విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి: కవిత

image

TG: బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. ‘ఇలాంటివి అన్ని పార్టీల్లో ఉంటాయి. సీఎం రేవంత్ ఏదైనా ప్రకటన చేయగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ ఈటల రాజేందర్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా అన్ని పార్టీల్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.

News August 10, 2025

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

image

చికెన్‌ను పవర్ హౌస్ అని అంటారు. దీనిని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు, బరువు పెరుగుతారు. అలర్జీ, ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.