News April 21, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

Similar News

News August 9, 2025

ఒకే వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉండొచ్చా?

image

దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలామంది రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారని AICC అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తికి ఒకే EPIC (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు) ఉండాలి. ఒక వ్యక్తి పేరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఉండాలి. వేరే ప్రాంతానికి మారినప్పుడు కొత్త ఓటరు కార్డు లభిస్తుంది. అలాంటప్పుడు ఫామ్ 7 ద్వారా పాత కార్డును రద్దు చేసుకోవాలి. రెండు చోట్లా ఓటు వేయడం చట్టరీత్యా నేరం.

News August 9, 2025

మతం దాచి పెళ్లి చేసుకుంటే జైలుకే.. హరియాణా చట్టం

image

మతాన్ని దాచి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా ₹4లక్షల జరిమానా, పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. చట్టబద్ధంగా అనుమతి పొందాకే మత మార్పిడి చేసుకోవాలంది.

News August 9, 2025

ఆ వెబ్ సిరీస్ చూసి బాలుడి సూసైడ్

image

బెంగళూరులో ఓ బాలుడు (14) వెబ్ సిరీస్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నమ్మకెరే అచ్చకట్టు పీఎస్ పరిధిలో నివసించే గాంధార్ ఇటీవల జపనీస్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ చూస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో గదిలోకి వెళ్లి ఓ లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడు. ‘నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి స్వర్గంలో ఉంటా’ అని రాశాడు. సిరీస్‌లోని ఓ క్యారెక్టర్ బొమ్మను కూడా తన గదిలో గీశాడు.