News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోని హోమ్ బేస్‌లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
Similar News
News August 8, 2025
‘కాంతార’ను వెంటాడుతున్న విషాదాలు

కాంతార మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పార్ట్ 1లో నటించిన <<17341034>>ప్రభాకర్ కళ్యాణ్<<>> మరణించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఈ చిత్రంలో నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు చనిపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మేలో రాకేశ్ పూజారి(34), కపిల్(32), జూన్‌లో కళాభవన్(43), తాజాగా ప్రభాకర్ కళ్యాణ్ మరణించారు. కారణమేదైనా కాంతారను విషాదాలు వదలట్లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
News August 8, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT
News August 8, 2025
బండి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన <<17342231>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. ‘సంజయ్ స్టేట్‌మెంట్స్ హద్దు మీరాయి. హోంశాఖ మంత్రి అయినా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని ఆయనకు సవాల్ విసురుతున్నా. 48 గంటల్లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపి కోర్టుకు లాగుతా’ అన్నారు.