News April 21, 2025
భూ సమస్యల కోసమే భూభారతి: ASF కలెక్టర్

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. KZR మండలం వంజీరి రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, అంశాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూభారతి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రికార్డులలో ఏదైనా తప్పుల సవరణకు తహశీల్దార్ కార్యాలయంలో సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News January 14, 2026
పట్టువర్ధనంలో పండగ వేళ విషాదం

వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.
News January 14, 2026
NGKL: జిల్లాలో 847 టన్నుల యూరియా నిల్వలు

జిల్లాలో 847 టన్నుల యూరియా విలువలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు లేదా ఎల్లుండి జిల్లాకు 1,771 టన్నుల కోరమండల్, స్పీక్ కంపెనీల యూరియా జడ్చర్ల రేక్ పాయింట్ ద్వారా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ నెలలో మరో 4,349 టన్నుల యూరియా రానుందని పేర్కొన్నారు. జిల్లాలో మొక్కజొన్న విస్తీర్ణం 6 రేట్లు పెరిగినందున యూరియాకు డిమాండ్ పెరిగిందని తెలిపారు.
News January 14, 2026
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.


