News March 28, 2024

అప్పుడు బెంగళూరుకు.. ఇప్పుడు హైదరాబాద్‌కు

image

పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో అతడు భాగస్వామిగా ఉన్నారు. 2013లో ఆర్సీబీ 263 రన్స్ చేయగా అప్పుడు అతడు బెంగళూరు తరఫున ఆడారు. నిన్నటి మ్యాచ్‌లో 277 పరుగులతో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన SRHకు ఉనద్కత్ ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు మ్యాచుల్లోనూ జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీయడం విశేషం.

Similar News

News March 11, 2026

‘మినిమం బ్యాలెన్స్’ ఫైన్‌లతో ₹19,000 కోట్లు

image

అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్లపై వేసే ఫైన్ ద్వారా బ్యాంకులు మూడేళ్లలో (2022-23 to 2024-25) ₹19,000 కోట్లు కలెక్ట్ చేశాయి. దీంట్లో ప్రైవేట్ బ్యాంకులు ₹11,000 కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ₹8,000 కోట్లు వసూలు చేశాయి. అత్యధికంగా ప్రైవేట్ రంగంలో HDFC (₹3,872Cr), పబ్లిక్ సెక్టార్‌లో PNB (₹1,578Cr) ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.

News March 11, 2026

సక్సెస్ స్టోరీ: 9 నెలల్లో ₹800 కోట్ల సామ్రాజ్యం..!

image

‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అనే మాటను 23 ఏళ్ల అంజలి సర్దానా(బెంగళూరు) నిజం చేశారు. ఆమె స్థాపించిన ‘Pronto’ అనే హోమ్ సర్వీసెస్ యాప్ 9 నెలల్లోనే ₹800 కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. క్లీనింగ్, కుకింగ్ వంటి ఇంటి అవసరాలను తీర్చే ఈ బిజినెస్ మోడల్‌ ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. దాదాపు 3వేల మందికి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. యువత తలచుకుంటే ఆకాశమే హద్దు అని అంజలి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.

News March 11, 2026

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగు – ఎన్నో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.