News April 21, 2025
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.
Similar News
News January 12, 2026
PSLVకి ‘మూడో మెట్టు’పైనే తడబాటు!

PSLV వరుసగా రెండు ప్రయోగాల్లో (C61, <<18833915>>C62<<>>) మూడో దశలోనే విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ దశలో ఘన ఇంధనం మండుతున్నప్పుడు రావాల్సిన థ్రస్ట్ తగ్గినా లేదా నాజిల్ కంట్రోల్ వ్యవస్థ వైఫల్యమైనా రాకెట్ దారి తప్పే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇదే కారణంతో C61 విఫలమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు C62లోనూ అదే దశలో లోపం తలెత్తటంతో పాత తప్పిదాన్ని సరిదిద్దడంలో విఫలమయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి!
News January 12, 2026
‘రాజాసాబ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ఇండియాలో రూ.129.20కోట్లు, ఓవర్సీస్లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా నార్త్ అమెరికా గ్రాస్ కలెక్షన్స్ $2.2M (రూ.19.83కోట్లు) దాటినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
News January 12, 2026
బంగ్లాదేశ్ WC మ్యాచులు భారత్లోనే!

టీ20 వరల్డ్ కప్లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ICC ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటిని శ్రీలంకకు మార్చకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం బంగ్లా టీమ్ కోల్కతా, ముంబైలో 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిని విదేశాల్లో నిర్వహించకపోవచ్చని సమాచారం. అక్కడ జరగాల్సిన మ్యాచులను చెన్నై, తిరువునంతపురంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.


