News April 21, 2025
జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షల నిర్వహణ

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Similar News
News January 11, 2026
మరో యాదాద్రిగా కీసరగుట్ట? మోక్షం ఎన్నడు!

HYD శివారు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరో యాదాద్రి దేవాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. నాటి నుంచి కోట్లాది మంది భక్తులు రాష్ట్రంలో మరో యాదాద్రి స్థాయిలో కీసరగుట్టను చూడాలనే ఆశతో వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్టు ముందుకు పడకపోవడం, దేవాలయం వద్ద పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News January 11, 2026
IMH కడపలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడపలో 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల 42ఏళ్లలోపు అభ్యర్థులు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG,అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), పీజీ డిప్లొమా(మెడికల్ & సోషల్ సైకాలజీ), M.Phil ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
News January 11, 2026
కర్నూలు: నెల రోజుల క్రితం రూ.260.. నేడు రూ.300

కర్నూలులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం కేజీ రూ.260 ఉండగా నేడు రూ.300 పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతి, కనుమ రానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 70% తెలంగాణ నుంచి బ్రాయిలర్ కోళ్లు సరఫరా అవుతున్నాయి. 25% కర్ణాటక నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 5% మాత్రమే జిల్లాలో కోళ్ల ఉత్పత్తి అవుతోంది.


