News April 21, 2025

SVU పరీక్షల వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Similar News

News January 20, 2026

కామారెడ్డి జిల్లాలో తగ్గుముఖం పట్టిన చలి

image

కామారెడ్డిలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. చలి తగ్గుముఖం పట్టగా జుక్కల్, గాంధారి 12.8°C, మేనూర్, లచ్చపేట 13.3, రామలక్ష్మణపల్లి 13.4, తాడ్వాయి 14.1, ఎల్పుగొండ 14.2, భిక్కనూరు 14.7, మాచాపూర్, నాగిరెడ్డిపేట 14.9, దోమకొండ, డోంగ్లి, పెద్దకొడప్గల్ 15°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

News January 20, 2026

18 ఏళ్లు నిండినవారందరికీ ఓటు నమోదు చేయాలి: కలెక్టర్

image

జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని అల్లూరి కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ప్లకార్డులు, స్లోగన్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి, జిల్లాలోని 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు నమోదు చేయాలని, ఓటర్ ఐడీ కార్డులు వచ్చే విధంగా చూడాలన్నారు.

News January 20, 2026

ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్‌కి దరఖాస్తులు

image

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగినవారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.