News April 21, 2025

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిల్పూర్ RI

image

భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ RI ఏసీబీకి పట్టుబడ్డారు. చిల్పూర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో RIగా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఓ వ్యక్తి వద్ద భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. సోమవారం బాధితుడు రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News

News April 22, 2025

NZB: దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్ల (MRP, DRP)లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తుల ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకం చేపడుతుందన్నారు.

News April 22, 2025

KMR: పోలీసు భద్రత పథకంతో ఆర్థిక భరోసా: SP

image

పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘భద్రత’ పథకం ద్వారా పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ డి.రామన్ కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అన్నిరకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

News April 22, 2025

MNCL: సజావుగా జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. రెండో రోజైన సోమవారం పదో తరగతి పరీక్షకు మొత్తం 504కి 438 మంది హాజరు కాగా 66 మంది రాలేదు. అలాగే ఇంటర్ పరీక్షకు మొత్తం 928కి 824 మంది హాజరయ్యారు. 104 మంది పరీక్ష రాయలేదని డీఈఓ యాదయ్య తెలిపారు.

error: Content is protected !!