News April 21, 2025

సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.

Similar News

News November 18, 2025

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

image

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.