News April 21, 2025

ఏడాదికి 80లక్షల ఉద్యోగాలు సృష్టించాలి: అనంత్ నాగేశ్వరన్

image

2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.

Similar News

News November 18, 2025

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

image

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి