News April 21, 2025
సంగారెడ్డి: ప్రజావాణిలో 63 ఫిర్యాదులు

కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Similar News
News January 11, 2026
మంథని అభివృద్ధికి రూ.45 కోట్లతో శ్రీధర్ బాబు శంకుస్థాపన

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల రూపాయలతో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బస్ స్టాండ్‌లు, కుల సంఘాల కమ్యూనిటీ హాల్‌లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణం, దేవాలయాల సుందరీకరణ పనులు, ఈద్గా నిర్మాణం పనులు, వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం, మహిళా సంఘం భవన నిర్మాణం పనులు ఉన్నాయి. వీటితో మంథనికి మహర్దశ పట్టనున్నది.
News January 11, 2026
చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 11, 2026
పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే..?

దేవుని ప్రసాదంగా పొందిన పసుపును పూజా గదిలో ఉంచి నిత్యం పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మరోగాలు తొలగి దేహకాంతి పెరుగుతుంది. ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వివాహ దోషాలు ఉన్నవారు పసుపు గౌరీని పూజించాలి. వ్యాపార స్థలాల్లో పసుపు నీరు వాడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే పసుపు దానం చేయడం శ్రేయస్కరం. ఫలితంగా ఇంట్లో దైవకళ ఉట్టిపడి, సకల శుభాలు కలుగుతాయి.


