News April 21, 2025
రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్‌లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఎల్లుండి కూడా 12 మండలాల్లో తీవ్ర, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News August 9, 2025
PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News August 9, 2025
మూడు విడతల్లో వేతనాల పెంపు: నిర్మాతలు

సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. వేతనం రూ.2వేల(రోజుకు) లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే 30శాతం పెంపునకు సుముఖంగా లేమని తెలిపారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5, మూడో విడతలోనూ 5% పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు. ఇక కార్మిక ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
News August 9, 2025
వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.