News March 28, 2024

భూమి వేగం తగ్గుతోంది.. మన టైమూ మారుతుంది

image

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాల్లో మంచు కరుగుతోంది. దీంతో ద్రవ్యరాశి తగ్గి భూగమన వేగం నెమ్మదిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల 2029కి మన టైమ్ ఒక సెకన్ తగ్గిపోనుందని పేర్కొంది. దీన్ని ‘నెగెటివ్ లీప్ సెకన్’గా పిలుస్తారని వెల్లడించింది. ఇది కంప్యూటర్ నెట్‌వర్క్‌లో సమస్యను కలిగిస్తుందని, UTC(కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్)లో ముందుగానే మార్పులు చేయాల్సి ఉందని తెలిపింది.

Similar News

News March 26, 2026

HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

image

కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2026

మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

image

ఖర్గ్ <<19478356>>ద్వీపం<<>> స్వాధీనానికి US ప్లాన్ చేస్తే యెమన్ సమీపాన ఉండే బాబ్ ఎల్-మండేబ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సరకు రవాణాకు ఇది ఎంతో కీలకం. ఇది మూతబడితే ఆఫ్రికా <<19394249>>చుట్టూ<<>> తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో చమురు సంక్షోభం ముదిరేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హౌతీ ఇరాన్‌కు మద్దతు తెలిపింది.

News March 26, 2026

కరెంట్ ఛార్జీలపై GOOD NEWS

image

AP: FY27లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూఅప్ భారమూ వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్‌లకు ₹15,790Cr రెవెన్యూ లోటును తామే భరిస్తామని APERCకి లేఖ రాసింది. దీనివల్ల 1.30Cr గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది. 22L మంది రైతులకు, 22 లక్షల SC, ST, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్ కొనసాగనుంది. 2L మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గనుంది.