News April 22, 2025

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.

Similar News

News August 8, 2025

భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్?

image

ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని తమ ఎగుమతిదారులకు యూఎస్ నుంచి మెయిల్స్, లెటర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ఆర్డర్లు నిలిపేయాలని సూచించినట్లు సమాచారం. తదుపరి అప్డేట్ అందేవరకూ ఎగుమతులను నిలిపేయాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

News August 8, 2025

‘కెప్టెన్‌ జురెల్’ అని RR పోస్ట్.. శాంసన్ ఫ్యాన్స్ షాక్!

image

ధ్రువ్ జురెల్‌ను కెప్టెన్‌గా పేర్కొంటూ రాజస్థాన్ రాయల్స్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘స్టంప్స్ వెనుక ఆటను మార్చే వ్యక్తి ఒకరు ఉంటారు’ అని రాసుకొచ్చింది. అయితే <<17338073>>శాంసన్<<>> RRను వీడుతారనే ప్రచారం నడుమ ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. సంజూ స్థానంలో జురెల్‌కు పగ్గాలిచ్చారా? అని ఫ్యాన్స్ షాకయ్యారు. ట్విస్ట్ ఏంటంటే జురెల్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు కెప్టెన్సీ చేయనున్నారు. దాని గురించే RR పోస్టు చేసింది.

News August 8, 2025

ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్

image

ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు. వారానికి 3 సార్లు తినే వారిలో 20శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తమ రీసెర్చ్‌లో తేలిందని వెల్లడించారు. అంతే మొత్తంలో ఉడికించి, కాల్చిన బంగాళాదుంపలను తింటే ముప్పు ఈ స్థాయిలో ఉండదని హార్వర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీల పరిశోధకులు 40 ఏళ్లుగా జరిపిన నివేదికలను బయటపెట్టారు.