News April 22, 2025

DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

Similar News

News April 22, 2025

‘ఛావా’ మరో రికార్డ్

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ-2, పుష్ప-2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్‌గా రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లోనూ నంబర్-1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

News April 22, 2025

గిల్-సాయి జోడీ అదుర్స్

image

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.

News April 22, 2025

నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

image

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.

error: Content is protected !!