News April 22, 2025
పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Similar News
News April 22, 2025
సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

AP: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.
News April 22, 2025
ఎల్లుండి నుంచి సెలవులు

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి(APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. హాలిడేస్‌లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
News April 22, 2025
ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు Dy.CM భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్కుల జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.