News April 22, 2025

పారదర్శకంగా ఇసుక పంపిణీ ప్రక్రియ కొనసాగాలి: కడప కలెక్టర్

image

జిల్లాలో ఇసుక పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. ఇబ్రహీంపేట రీచ్‌లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలన్నారు. ఎక్కడా అవకతవకలు జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News September 10, 2025

కడప జిల్లాలో పలువురు పోలీస్ సిబ్బంది బదిలీ

image

కడప జిల్లాలో 44 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, HCలు, PCలు, WPCలు ఉన్నారు.

News September 10, 2025

కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.

News September 10, 2025

కడప: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

image

కడప తాలూకా స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప, SI తులసినాగ ప్రసాద్ తెలిపారు. భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాజ్ కుమార్ అనే రౌడీషీటర్ అయిదేళ్ల చిన్నారిపై ఈనెల 7వ తేదీన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.