News April 22, 2025
సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.
Similar News
News September 12, 2025
ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News September 12, 2025
విశాఖలో V-PULL వ్యవస్థ బలోపేతం: జీవీఎంసీ కమిషనర్

జీవీఎంసీ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన V-PULL వ్యవస్థను బలోపేతం చేసి సంస్థాగతం చేయాలని గురువారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సూచించారు. ప్రజలు, నిపుణులు, సంస్థలు కలిసి కో-క్రియేషన్ పద్ధతిలో పట్టణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జీవీఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.
News September 11, 2025
ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా రామకృష్ణ ప్రసాద్

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కె.వి.రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖలోని సమస్త ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై 31 వరకు ఆయన సీవీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని మరో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో సీవీవోగా ప్రభుత్వం నియమించింది. సంస్థ సీఎండీ పృథ్విరాజ్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.