News April 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 22, 2025
ప్రధాని మోదీ గ్రేట్ లీడర్: జేడీ వాన్స్

ఢిల్లీలో నిన్న రాత్రి PM మోదీ, US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు Xలో స్పందించారు. ‘ట్రంప్‌తో మీటింగ్‌లో చర్చించిన అంశాల పురోగతిపై వాన్స్‌ను అడిగి తెలుసుకున్నా. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మన ప్రజల భవిష్యత్‌తో పాటు ప్రపంచానికి తోడ్పడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘మోదీ గొప్ప లీడర్. భారత ప్రజలతో స్నేహం, సహకారం బలోపేతానికి కృషి చేస్తా’ అని వాన్స్ పేర్కొన్నారు.
News April 22, 2025
సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

AP: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.
News April 22, 2025
ఎల్లుండి నుంచి సెలవులు

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి(APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. హాలిడేస్‌లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.