News April 22, 2025
నిర్మల్: టెలిఫోన్‌లో ప్రజావాణి.. వాట్సప్‌లో రసీదులు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల తరలివచ్చారు. స్థానిక సంస్థల ప్రాథమిక కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతల వల్ల రాలేని వారి కోసం టెలిఫోన్‌లోను ఫిర్యాదుల స్వీకరణ చేసి రసీదులను 9100577132 వాట్సప్‌లో పంపించామన్నారు.
Similar News
News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
కరీంనగర్: ఓపెన్ పదో, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తెలిపారు. పదో తరగితి పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో 410 మందికి 375 మంది, ఇంటర్ పరీక్షకు 4 పరీక్షా కేంద్రాల్లో 908 మందికి 839 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 టెన్త్ పరీక్ష కేంద్రాలో మొత్తం 62 మందికి 52 మంది హాజరైనట్లు పరీక్ష ఓపన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.
News April 22, 2025
గద్వాల: హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ సమీక్ష

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రొటేషన్ ద్వారా గద్వాలకు వచ్చిన 53 మంది హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు సోమవారం సమావేశమయ్యారు. గ్రివెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమీక్షలో ఆయన మాట్లాడారు. హోమ్ గార్డ్స్ క్రమశిక్షణతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. విధుల్లో ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.