News April 22, 2025

మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

image

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Similar News

News August 8, 2025

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News August 8, 2025

నీట్, జేఈఈ విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్

image

నీట్, జేఈఈ-2026 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్‌ను సిద్ధం చేసినట్లు ఐఐటీ/జేఈఈ ఫోరం తెలిపింది. ఇందులో స్టడీ మెటీరియల్, గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, NCERT నీట్ క్వశ్చన్ బ్యాంక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. పూర్తి సమాచారానికి 9849016661 నంబర్ వాట్సాప్‌లో మెసేజ్ చేయాలని సూచించింది.

News August 8, 2025

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించింది. అనుభవం తప్పనిసరి. కనిష్ఠ వయోపరిమితి 24 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా పేర్కొంది. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ.850, మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.