News April 22, 2025

KMR: పోలీసు భద్రత పథకంతో ఆర్థిక భరోసా: SP

image

పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘భద్రత’ పథకం ద్వారా పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ డి.రామన్ కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అన్నిరకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

Similar News

News April 22, 2025

ప్రధాని మోదీ గ్రేట్ లీడర్: జేడీ వాన్స్

image

ఢిల్లీలో నిన్న రాత్రి PM మోదీ, US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు Xలో స్పందించారు. ‘ట్రంప్‌తో మీటింగ్‌లో చర్చించిన అంశాల పురోగతిపై వాన్స్‌ను అడిగి తెలుసుకున్నా. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మన ప్రజల భవిష్యత్‌తో పాటు ప్రపంచానికి తోడ్పడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘మోదీ గొప్ప లీడర్. భారత ప్రజలతో స్నేహం, సహకారం బలోపేతానికి కృషి చేస్తా’ అని వాన్స్ పేర్కొన్నారు.

News April 22, 2025

సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

image

AP: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.

News April 22, 2025

అల్లూరి: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదోతరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. అల్లూరి జిల్లాలో 258 పాఠశాలల నుంచి 11,766 మంది పరీక్ష రాయగా వారిలో 5,476 మంది బాలురు, 6,290 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 11,564 మంది కాగా ప్రైవేట్‌గా 202 మంది పరీక్ష రాశారు. 71 సెంటర్లలో పరీక్షలు జరగ్గా తెలుగు మీడియం 8,140, ఇంగ్లిష్ మీడియం 3,626 మంది ఉన్నారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

error: Content is protected !!