News April 22, 2025

గద్వాల: క్విజ్ పోటీల్లో ఉత్తనూర్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్

image

గద్వాల బాల భవన్‌లో సోమవారం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి క్విజ్ పోటీలు జరిగాయి. సైన్స్ విభాగంలో జరిగిన పోటీల్లో అయిజ మండలం ఉత్తనూర్ జడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అమరేశ్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. డీఈవో అబ్దుల్ గని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్తేరు రాణి, సైన్స్ ఆఫీసర్ పాపన్న చేతుల మీదుగా బహుమతి అందజేశారు. ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 22, 2025

జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

image

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.

News April 22, 2025

సంజామల పోలీసులు నన్ను కొట్టారు: అల్లూరి రమేశ్‌

image

ఓ వ్యక్తి గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లగా పోలీసులు వాతలు పడేలా కొట్టిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో PDTR-KNL వెళ్లే బస్సును నొస్సంలో భరత్ అనే యువకుడు ఆపడంతో, కండక్టర్ శాంతతో వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భరత్‌ను కాకుండా తనను అకారణంగా కొట్టారని రమేశ్‌ ఆరోపించారు. బాధితుడు JMDలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో తప్పెవరిదనే నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2025

రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

image

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓ హక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జరగబోయే ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ముమ్మురమైన ఏర్పాటు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు.

error: Content is protected !!