News April 22, 2025
నారాయణపేటకు నూతన వైద్యాధికారి

నారాయణపేట జిల్లా నూతన వైద్య శాఖ అధికారిగా డాక్టర్ జయ చంద్రమోహన్‌ను నియమిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ DMHOగా పని చేసిన సౌభాగ్యలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధికారులు విచారణ చేసి కార్యదర్శికి నివేదికలు అందించారు. దీంతో ఆమెను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.
News April 22, 2025
సంజామల పోలీసులు నన్ను కొట్టారు: అల్లూరి రమేశ్

ఓ వ్యక్తి గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లగా పోలీసులు వాతలు పడేలా కొట్టిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో PDTR-KNL వెళ్లే బస్సును నొస్సంలో భరత్ అనే యువకుడు ఆపడంతో, కండక్టర్ శాంతతో వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భరత్‌ను కాకుండా తనను అకారణంగా కొట్టారని రమేశ్ ఆరోపించారు. బాధితుడు JMDలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో తప్పెవరిదనే నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓ హక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జరగబోయే ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ముమ్మురమైన ఏర్పాటు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు.